
*ఎండపల్లి మండలం లో సజావుగా సాగిన ఎన్నికలు*
*గ్రామ గ్రామాన కొలువు తీరిన నూతన పాలక వర్గం*
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి డిసెంబర్ 17(మన ప్రజావాణి):
ఉత్కంఠ పోరుకు తెరపడింది, తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. నిన్న మొన్నటి వరకు ఓటర్లను ఆకట్టుకుంటూ ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు, గెలిచినవారు విజయోత్సవ ర్యాలీతో, ఓడినవారు "బెటర్ లక్ నెక్స్ట్ టైం" అంటూ సరిపెట్టుకున్నారు, ఈ సందర్భంగా గ్రామాల్లో నూతన సర్పంచులతో పండగ వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలో కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచులు వీరే ఇందులో ఎండపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ గా మారం సునీతా - జలంధర్ రెడ్డి,
రాజారాంపల్లి లో సంఘ రమేష్,
గుల్లకోట లో గొల్లపల్లి మల్లేశం గౌడ్,
గోడిశెలపేట లో కందికట్ల అమృత - రాజేశం,
పాతగూడూర్ కొంగల జగదీశ్వర్ రెడ్డి,
చర్లపల్లి పడిధం మొగిలి,
అంబారిపేట దర్శనాల నరేష్,
ముంజంపల్లి సింగిరెడ్డి లింగారెడ్డి,
మారేడుపల్లి బాలసాని శారద - మల్లేశం గౌడ్,
సూరారం కోడిపెల్లి కొమురమ్మ - శ్రీనివాస్,
పడకల్ బెడ్డల ప్రవీణ్,
కొత్తపేట లో జీ రెడ్డి మహేందర్ రెడ్డి,
ఉండేడ ఆవుల మమత - తిరుపతి,
సానబండ లో గాదం భాస్కర్ లు ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు.
కొండాపూర్ గ్రామంలో తాటిపర్తి రాజవ్వ (ఏకగ్రీవం) గా ఎన్నికైన విషయం తెలిసింది.
ఈ సందర్భంగా ఆయా సర్పంచ్ లు మాట్లాడుతూ.... మాపై అపారమైన నమ్మకం ఉంచి మాకు ఓటు వేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న ఐదు సంవత్సరాలు గ్రామంలో ఉంటూ ప్రజల బాగోగులను చూసుకుంటూ గ్రామ సేవకై పాటుపడతామని నూతన సర్పంచులు తెలిపారు, అనంతరం గ్రామస్తులు పలు నాయకులు నూతనంగా గెలుపొందిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న మొన్నటి వరకు మా చుట్టూ తిరగడమే కాకుండా ఇకపై కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి సమస్యపై పోరాటం చేయాలని వారు ఆకాంక్షించారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025