
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంశంకర్ గిరి తండా నుండి. చింతకాని మండల కేంద్రానికి వచ్చిన ఆ పంచాయతీ కార్యదర్శి అవినీతికి అడ్డుపద్దు లేదు.. మన ప్రజావాణి నిఘా నేత్రానికి చిక్కిన సాక్ష్యాలు
. ఎన్నెన్నో..!
సుమారు 18 గుంటల భూమిని..(అసైన్మెంట్ భూమి) క్రమ బద్దీకరించిన పంచాయతీ కార్యదర్శి..!?
20 అక్రమ క్రమబద్ధీకరణ వెనుక.. చేతులు మారిన లక్షలాది రూపాయలు...?
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న.. చింతకాని పంచాయతీ కార్యదర్శి..?
మన ప్రజావాణి ప్రత్యేక కథనం.1
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలోని శంకర్ గిరి తండా నుండి బదిలీపై వచ్చిన సదరు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఆన్లైన్ ప్రక్రియ నమోదు చేసినట్లు ఇంటి నెంబర్లు కూడా కాసులకు కక్కుర్తి పడి ఒక్కొక్క ఇంటి నుండి సుమారు 5000 నుండి 10000 రూపాయల వరకు అక్రమంగా దండుకున్నట్లు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ డి పి ఓ స్పందించి సదరు అవినీతి పంచాయతీ కార్యదర్శి పై బహిరంగ విచారణ చేయాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025