
క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
మన ప్రజావాణి
చౌడేపల్లి జనవరి 17
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం లో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది మండలంలోని వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి, కుమారుడు 'తేజ' 22 గ్రామానికి సమీపంలోని పాలెంపల్లి వద్ద క్రికెట్ టోర్నమెంట్ కు వెళ్ళాడు అక్కడ ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు సహచరులు వెంటనే అతన్ని చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పుంగనూరుకు సిఫారసు చేశారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025