
గుండెపోటుతో యువకుడు మృతి
అన్నమయ్య జిల్లా
చౌడేపల్లి జనవరి 18
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండా మర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసులు 39 గుండెపోటుతో మరణించిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అతని భార్య ఏడాది క్రితం భర్తను వదిలేసి వెళ్లిపోవడంతో మనస్థాపంతో వేదన చెందుతుండేవాడని గ్రామస్తులు తెలియజేశారు. ఇంటి గుమ్మం ముందు ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతనికి ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె వికలాంగుడైన కుమారుడు కలిగి ఉన్నారు. తల్లి లేక తండ్రి కూడా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025