
చోరికి గురైన గ్లామర్ బైక్
బైక్ వెనకాల "విశ్వకర్మ" అనే ఆనవం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జనవరి 20 (మన ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో జనరల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన నర్సింగోజు రవీంద్రచారి తన ఎరుపు రంగు "హీరో గ్లామర్" TS 02 EN 3704 అను నెంబర్ గల ద్విచక్ర వాహనం అపహరణకు గురైనట్లు తెలిపారు. ఈ వాహనానికి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ దిగువన "విశ్వకర్మ" అని ఎరుపు రంగు రేడియం తో రాసి ఉంటుందని తెలిపారు. వాహన యజమాని రవీంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం.... తను రోజులాగానే షాపు నిర్వహించి సోమవారం రోజున రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో షాపు మూసివేసి రాజారాం పల్లి నుండి గోదావరిఖని వెళ్లే హైవే రూట్ సమీపంలో తను అద్దెకు ఉంటున్న ఇంటిముంది హ్యాండిల్ లాక్ చేసి, హీరో గ్లామర్ వాహనాన్ని పార్క్ చేసి గది లోపలికి వెళ్లి, ఉదయం బయటకు వచ్చి చూసేసరికి వాహనం కనిపించడం లేదని తెలిపారు. ఎవరైనా ఎరుపు రంగు "హీరో గ్లామర్" TS 02 EN 3704 నంబర్ ప్లేట్ గల వాహనం, ఆ వాహనానికి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ దిగువన "విశ్వకర్మ" అని రాసి ఉన్న వాహనాన్ని గమనించినట్లయితే, తన సెల్ నెంబర్లు 9908328095, 9559441123 కి సమాచారం ఇవ్వవలసింది రవీంద్రచారి కోరుచున్నాడు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025