
మహారాష్ట్ర, జార్ఖండ్ (Maharashtra, Jharkhand) ఎన్నికల ఫలితాలతో ప్రాంతీయ పార్టీలు(Regional parties) ఎల్లప్పుడూ భారత రాజకీయాల భవిష్యత్తుగా ఉన్నాయని.. కొనసాగుతాయని.. రాత గోడమీద! స్పష్టమైన సందేశాన్ని పంపాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించడంలో విఫలమైందని..కానీ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో తలమునకలవుతోందని.. ఇది పునరావృతమయ్యే అంశంగా మారిందన్నారు. నేను పునరుద్ఘాటిస్తున్నానని, కాంగ్రెస్ అసమర్థత, అసమర్థత వల్లనే బీజేపీ మనుగడ సాగిస్తోందన్నారు.
ప్రాంతీయ పార్టీల కృషి, నిబద్ధతపై రెండు జాతీయ పార్టీలు సిగ్గులేకుండా దుమ్మెత్తి పోస్తున్నాయని మండిపడ్డారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ఓ సలహా అని.. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు మీ పార్టీని ఘోర వైఫల్యం నుండి కాపాడలేకపోయాయని ఎద్ధేవా చేశారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి, ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు మీరు వాగ్దానం చేసిన ఆరు హామీలను అందించగలరా? అని ప్రశ్నించారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025