అభివృద్దిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు.. వార్డుకు ఒక ఆఫీసర్

Ramesh

Ramesh

District Chief Reporter

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరేలా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వార్డుకు ఒక ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. దీనికి గాను 1,829 మంది గ్రూప్-4 ఉద్యోగులను వార్డు ఆఫీసర్లుగా కేటాయించింది. వీరిలో హైదరాబాద్ రీజియన్‌కు 958 మంది, వరంగల్ రీజియన్‌కు 871 మంది అలాట్ చేసింది.

 

రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో 3,488 వార్డులున్నాయి. ఇందులో 50 వేల జనాభా కంటే తక్కువగా ఉంటే రెండు వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50 వేలకుపైగా జనాభా ఉంటే ఒక వార్డు ఆఫీసర్‌ను నియమించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగుడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బడంగ్‌పేట పరిధిలోని ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్‌ను నియమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక ఆఫీసర్‌ను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

పురపాలక శాఖకు కేటాయించిన 2,217 మంది గ్రూప్-4 ఉద్యోగులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రెండు రోజులుగా సాగుతున్నది. వీరిలో ఇప్పటి వరకు 1,928 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 289 మంది ఉద్యోగులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 1023 మంది హాజరయ్యారు. వీరిలో వార్డు ఆఫీసర్లు 821, జూనియర్ అసిస్టెంట్లు 91, జూనియర్ అకౌంటెంట్లు 111 మంది ఉన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 905 మంది హాజరైతే వారిలో వార్డు ఆఫీసర్లు 748 మంది, జూనియర్ అసిస్టెంట్లు 66, జూనియర్ అకౌంటెంట్లు 91 మంది ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share