
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (Adani Group of Industries) ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani), అతని మేనల్లుడు సాగర్ అదానీ (Sagar Adani)లపై అమెరికాలోని న్యూయార్క్ (New York)లో లంచం కేసు నమోదవ్వడం తీవ్ర సంచలనానికి దారితీసింది. ఇప్పుడు ఈ వ్యవహారం భారతదేశంలో సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ.. విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈయనే హిడెన్ బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు చేయాలని పిటిషన్ వేశారు.
సోలార్ ఎనర్జీ (Solar Energy) ఒప్పందాల కోసం లంచం ఆఫర్ చేశారని అమెరికాలో కేసు నమోదైన మర్నాడే.. ఆంధ్రాలో గత ప్రభుత్వ హయాంలో భారీగా లంచాలు ఆఫర్ చేశారన్న విషయం బయటికొచ్చింది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెకీ ఒప్పందం గురించి తనకు తెలిసింది మీడియా ముందు వెళ్లగక్కారు. ప్రాజెక్టు గురించి పూర్తిగా చెప్పకుండా అర్థరాత్రి లేపి సంతకం చేయమన్నారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో మర్నాడు కేబినెట్ సమావేశం పెట్టి ఆమోదింప చేసుకున్నారని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాదు.. ఏపీలో ప్రాజెక్ట్ కోసం వేలకోట్ల ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు చేయడంతో.. ఏపీలో జగన్ ఇంకా ఎన్నెన్ని చేశాడోనన్న చర్చ మొదలైంది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025