
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై(OLA Electric Scooter) కస్టమర్లు(Customers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ కస్టమర్ షోరూం(Showroom)కి చెప్పుల దండ వేయగా.. మరో కస్టమర్ స్కూటీకి ఏకంగా నిప్పు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఓలా స్కూటీపై ఓ కస్టమర్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కస్టమర్ రిపేర్ కు వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి మరి షోరూం ముందే సుత్తితో పగలగొట్టాడు.
ఇప్పటివరకు స్కూటీని బాగు చేయించడానికి 90 వేల వరకు ఖర్చు చేశానని, అయినా సరే మరోసారి రిపేర్ కు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై షోరూం యజమాన్యం నుంచి సరైన స్పందన లేదని, అందుకే ఈ విధంగా నిరసన తెలుపుతున్నానని చెప్పాడు. అంతేగాక ఆ వ్యక్తి అక్కడికి వచ్చిన వారిని పిలిచి మరి తన బండిని బద్దలు కొట్టొచ్చని ఆఫర్ ఇస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. చాలా మందికి ఇలాగే జరుగుతోందని కామెంట్లు పెడుతున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025