ట్రంప్‌ వీర విధేయుడు కాష్‌ పటేల్‌‌కు కీలక పదవి

Ramesh

Ramesh

District Chief Reporter

అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డిప్యూటీ డైరెక్టర్ పదవి రేసులో భారత సంతతి యువతేజం 44 ఏళ్ల కాష్‌ పటేల్‌(Kash Patel) ముందంజలో ఉన్నారు. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు వీర విధేయుడిగా పేరుండటంతో ఆయనకు ఈ కీలక పదవి దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ట్రంప్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకొని ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి కోసం కాష్ పటేల్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (2020 సంవత్సరంలో) సీఐఏ డైరెక్టర్‌, ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ పదవుల కోసం కాష్ పటేల్‌ పేరును ట్రంప్ పరిశీలించారు. అయితే అప్పట్లో వాటిని కేటాయించడం సాధ్యపడలేదు. అందుకే ఈసారి ఏదైనా ఒక కీలక పదవిని తన అనుచరుడు కాష్‌ పటేల్‌‌కు కట్టబెట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.

కాష్ పటేల్‌ తల్లిదండ్రులు భారత్‌లోని గుజరాత్ నుంచి ఆఫ్రికా దేశం ఉగాండాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి కెనడాకు.. కెనడా నుంచి అమెరికాకు చేరుకొని స్థిరపడ్డారు. అమెరికాలోని న్యూయార్క్‌లో 1980లో కాష్ పటేల్‌ జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ రిచ్‌మండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను ఆయన పూర్తి చేశారు. కాగా, మాజీ ఎఫ్‌బీఐ స్పెషల్‌ ఏజెంట్‌ మైక్‌ రోజర్స్ పేరును ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి కోసం ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో సెనేట్‌ స్థానానికి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో రోజర్స్ ఓడిపోయారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్