
(Telangana) తెలంగాణలో కొత్త రైళ్ల కూత అంటూ తెలంగాణ (BJP) బీజేపీ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఎక్స్ (X) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. కొత్త స్టేషన్ల నిర్మాణంలో, కొత్త రైళ్లు తెలంగాణకు రావడంతో కేంద్రం కృషి, మోడీ సారథ్యంలో తెలంగాణ రైల్వే రూపురేఖలు మారాయని పేర్కొంది. (UPA) యూపీఏతో పోల్చితే.. ఎన్డీఏ ప్రభుత్వంలో మెరుగైన వసతులు కల్పించినట్టు తెలిపింది.
(NDA) ఎన్డీఏ ప్రభుత్వం 2024 -25 గాను రూ.5,071 కోట్లతో కొత్త లైన్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు చేపట్టిందని పేర్కొంది. కాంగ్రెస్తో పోల్చితే ఎన్డీఏ హయాంలో పదేళ్లలో 20 శాతం బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని వెల్లడించింది. ఏడాదికి సగటున 35 కిలోమీటర్ల కొత్త లైన్ల నిర్మాణం, 6 స్టేషన్లకు కొత్త భవనాలు, అధునాతనంగా 27 స్టేషన్లు, అందుబాటులోకి 73 కొత్త రైళ్లు అంటూ తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025