
ఐపీఎల్ మెగా వేలం(auction) దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ వేలంలో భారత యువ, స్టార్ ప్లేయర్లను కొనేందుకు అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో వేలానికి ముందు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకున్న హైదరాబాద్ జట్టు, అర్షదీప్, పంత్ వంటి ప్లేయర్లను కొనేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జట్టులోని సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ ను వేలంలోకి వదిలేసిన SRH జట్టు.. అతని స్థానంలో మరో బౌలర్ ను తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భారత స్టార్ బౌలర్ అయిన మహ్మద్ షమీ(Mohammed Shami)ని ఏకంగా 10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో హైదరాబాద్ జట్టులోకి షమీ వంటి స్టార్ బౌలర్ వచ్చి చేరాడు. షమీని కొన్న తర్వాత హైదరాబాద్ జట్టు పర్స్ వ్యాల్యు 35 కోట్లకు చేరుకుంది.
Editor: Ramesh Rao
All Rights Reserved | Mana Prajavaani - 2025