షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా.? లేదా.? ఈ ముఖ్య విషయాలు మీకోసమే.??

Ramesh

Ramesh

District Chief Reporter

మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు డేట్స్ ని తీసుకుంటూ ఉంటాము. ఈ డేట్స్ లో ఖర్జూరాలు కూడా ఒకటి. అయితే ఈ ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే ఈ ఖర్జూరాలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే
డయాబెటిస్
ఉన్నవారు మాత్రం వీటిని మితంగా తీసుకుంటేనే మంచిది అని అంటున్నారు. ఖర్జూరంలో ఫైబర్ మరియు ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ కె బి కాంప్లెక్స్,జింక్ సవృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ ఖర్జూరంలో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజు రెండు లేక మూడు ఖర్జూరాలను తింటే రక్తపోటు అనేది కంట్రోల్ లో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది అని అంటున్నారు…

Diabetes : షుగర్ ఉన్నవారు ఖర్జూరాలను తినొచ్చా…? లేదా…? ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??

అయితే ఈ ఖర్జూరం తియ్యగా మరియు కొలెస్ట్రాల్ లేకుండా తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కావున ఖర్జూరం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచదు. అలాగే ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ షుగర్ ఉన్న పేషెంట్లు తినొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఖర్జూరంలో గ్లైసేమిక్ ఇండెక్స్ 43 నుండి 55% వరకు ఉంటుంది. కావున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు. అందుకే వీటిని తీసుకోవచ్చు అని అంటున్నారు. దీనిలో ఫైబర్ కంటెంట్ షుగర్ పేషెంట్లకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఖర్జంలోని ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది…

ఖర్జూరాలలో కాల్షియంతో పాటుగా మరెన్నో మినరల్స్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఏ ఈ ఇతర విటమిన్లు కళ్ళు మరియు రక్తం, జుట్టుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచగలవు. అలాగే శరీరంలో వాపు మరియు మంట తగ్గించేందుకు కూడా ఈ ఖర్జూరాలు హెల్ప్ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అందుకే ప్రతిరోజు వీటిని కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే అతిగా తింటే ఖర్జూరాలలో కార్బ్స వలన దుష్ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. అందుకే డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు రోజుకు రెండు ఖర్జూరాలను మాత్రమే తీసుకోవాలి అని అంటున్నారు. అతిగా తీసుకోవద్దు అని అంటున్నారు. అయితే వీటిని తినే ముందు డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి. వారి సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి అని అంటున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share