
రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలి పారు. ఐఐఎం, ఐఐటీలకు ఉన్న విధంగా బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్స్గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించాలని అధికారులకు సూచించారు. సీఎం మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ విధానంలో) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వర్సిటీని ఏర్పా టు చేయాలని ఆదేశించారు.
Editor: Ramesh Rao
All Rights Reserved | Mana Prajavaani - 2025