
*నూజివీడు సీడ్స్ వారి క్షేత్ర ప్రదర్శన*
ఓదెల, మార్చి13 (మన ప్రజావాణి):
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ మొక్కజొన్న కొత్తవంగడం విన్నర్ గోల్డ్ (8413) రకంను గ్రామానికి చెందిన వంగల మహేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో రైతులతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ నీలా రాజు మాట్లాడుతూ..... ఈ యొక్క నూతన విన్నర్ గోల్డ్ మొక్కజొన్న వంగడం మిగతా రకాల హైబ్రిడ్ వంగడాల కంటే 4 నుండి 5 క్వింటాల వరకు అధిక దిగుబడి వస్తుందన్నారు, అంతేకాకుండా అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుందని, కత్తెర పురుగును పూర్తి స్థాయిలో తట్టుకుంటుందన్నారు. నూజివీడు సీడ్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొత్త వంగడం అయిన విన్నర్ గోల్డ్ ప్రతి ఒక్క రైతు ఆదరించి మంచి దిగుబడి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి, మారుతి, గంగరాజు, చంద్రమౌళి, అధిక సంఖ్యలో చుట్టూప్రక్క గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Editor: Ramesh Rao
All Rights Reserved | Mana Prajavaani - 2025