మంత్రి పొన్నం వస్తే.. చర్చకు సిద్ధమే: బీఆర్‌ఎస్‌ నేత మాట్ల మధు మాజీ సర్పంచ్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

మంత్రి పొన్నం వస్తే.. చర్చకు సిద్ధమే: బీఆర్‌ఎస్‌ నేత మాట్ల మధు మాజీ సర్పంచ్

ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు.సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తంగళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15 సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమేనని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా రావాలని సవాల్‌ విసిరారు. 12 ఏండ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు పొన్నం ప్రభాకర్ డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, వాటిని ఇప్పటికే ఖండించానని, ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వచ్చి తనకు డబ్బులు ఇచ్చినట్లు చెబితే, దేనికైనా సిద్ధమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే తమ గౌరవం ఉందని, తనకు వీలుకాకుంటే, పొన్నం ప్రభాకర్ వద్దకే వస్తామని చెప్పారు. హుస్నాబాద్ అయినా సరే, హైదరాబాద్‌ అయినా సరే సమయం చెబితే వస్తానని పేర్కొన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తనే, దీటుగా స్పందించామని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలన్నింటికీ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కారణమని, ఆయనే బాధ్యతవహించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేత కేకే, కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కుర్మా రాజయ్య, కొయ్యడ రమేష్, ఆత్మకూరి చంటి, గుండు ప్రేమ్ కుమార్, సిలువేరి చిరంజీవి, గొడిసెల ఎల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, అమర్ రావు, మల్లారాపు నరేష్, తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share