
*శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆడ్లూరి*
*దేవాలయానికి వంటశాల గది, సీసీ రోడ్డు నిర్మాణానికి హామీ*
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, మార్చి 14 (మన ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణ్ కుమార్ కు తీర్థ ప్రసాదాలను అధించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దేవాలయానికి వంటశాల గది, సీసీ రోడ్డు నిర్మాణానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, డాక్టర్ గురువారెడ్డి, రాజి రెడ్డి, చంద్రారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి రమేష్, ఎ ఏం సి వైస్ చైర్మన్ గోల తిరుపతి, డైరెక్టర్ సింగతి శ్రీనివాస్, గూడా రామ్ రెడ్డి, వెంకటస్వామి, ప్రసాద్, శ్రీనివాస్, జల్లెల నరేష్, సింగతి మహేష్, తనుగుల నవీన్, సంజీవ్, మన్నె జితేందర్, శ్రీనివాస్, మన్నే సురేష్, గుమ్మడి శ్రీహరి, సలాది రూపేష్, పవన్, యూత్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.