
*వేములవాడ అక్షయ లాడ్జి లో వ్యభిచారం*
•• కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు.
•••• అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
వేములవాడ //మన ప్రజావాణి
వేములవాడ పట్టణంలో అక్షయ లాడ్జిలో వ్యభిచారం నడిపిస్తున్న వ్యక్తితో పాటు లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పట్టణ సీఐ విరప్రసాద్ తెలిపారు.
ఈసందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ….వేములవాడ పట్టణ కేంద్రంలో అక్షయ లాడ్జి నందు వేములవాడ పట్టణానికి చెందిన మల్లె రత్నయ్య (38)అనే వ్యక్తి అక్షయ లాడ్జి ఓనర్ శీలం విజయ్ కుమార్ యాదవ్ తో కలసి అక్షయ లాడ్జిలో హైదరాబాద్ నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు అక్షయ అక్షయ లాడ్జి పై తనిఖీ లు చేపట్టి ఒక విటుడు, ఒక అమ్మాయిని, మల్లె రత్నయ్య,శీలం విజయ్ కుమార్ యాదవ్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మల్లె రత్నయ్య ను రిమాండ్ కి తరలించడం జరిగిందని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ తెలిపారు.హోటల్స్, లాడ్జి లలో అసాంఘిక కార్యాలపాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవని,హోటల్స్, లాడ్జిలలో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, లాడ్జిలలో బసకోసం వచ్చే వారి ఆధార్ కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్డులు తప్పకుండ తీసుకోవాలని,లాడ్జిలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని,ఎవరైన కొత్తవారు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్ వారికి సమచారం ఇవ్వాలని సూచించారు.