శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు

సాన యాదిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, మార్చి 15 (మన ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో శనివారం రోజున శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 30 బండ్లు పోటీల్లో పాల్గొనగా ప్రథమ స్థానంలో వెనుగుమట్ల గ్రామానికి చెందిన నేరెళ్ల నరేష్ గౌడ్ నిలిచి పావు తులం బంగారం అందుకున్నారు, ఈ పావుతుల బంగారం ను గుజ్జేటి మారుతి, బైరి నగేష్ జ్ఞాపకార్థం పద్మశాలి యూత్ సంఘం తరఫున బహుమతి ప్రధానం చేశారు, రెండవ స్థానంలో సెకల్ల గ్రామ దొనకొండ సుధీర్ ఎడ్లబండి గెలుపొందగా వారికి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ తరఫున పది తులాల వెండి బహుమతి ప్రధానం చేశారు, మూడవ స్థానంలో మాదాసు గాయత్రి చర్లపల్లి, పొట్లపెల్లి సాగర్ అచలాపూర్ లు రెండు ఎడ్ల బండ్లు గెలుపొందాయి, ఈ రెండింటికి కలిపి 5 తులాల వెండిని బహుమతిని దావుల లింగయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కుమారులు కుమార్తెలు కలిసి బహుమతి ప్రధానం చేశారు, అలాగే సాన యాదిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాన మారుతి, ఉపాధ్యక్షులు గుండ గంగయ్య, కోశాధికారి రేణికుంట శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బుర్ర సాయికుమార్, కమిటీ సభ్యులు మాజీ సర్పంచులు సింహాచలం జగన్, పొన్నం తిరుపతి, గొల్లపెల్లి మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ బీసగోని శ్రీనివాస్, భూసారపు రమేష్, గోనె సురేష్, గొల్లపెల్లి రాజు, రాజ్ పాల్ రెడ్డి, తిరుమలేష్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అరుట్ల రంగాచారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share