*వ్యవసాయ భూములను అక్రమంగా వెంచర్లుగా మార్పు*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*వ్యవసాయ భూములను అక్రమంగా వెంచర్లుగా మార్పు*

•••బఫర్ జోన్ లో ఇంటి పర్మిషన్

•••యాదేచ్చగా ప్లాట్లు చేసి అమ్మకాలు

•••ఇప్పటికే ప్లాట్లు కొని మోసపోయిన అమాయకపు ప్రజలు

••పట్టించుకోని జిల్లా యంత్రంగం…

•••ఇరిగేషన్,ఆర్ అండ్ బి నియమాలు పాటించని వైనం.

మన ప్రజావాణి //రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్లా జిల్లా లో ని ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసి అక్రమంగా ప్లాట్లుగా విభజించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వైనం. ఒకసాధారణ వ్యక్తి ఇంటిని నిర్మించడానికి ఎక్కడలేని షరతులు విదిస్తు ఇచ్చిన పర్మిషన్ వెనుకకు తీసుకొని జేసిబి తో కులగొట్టిన ఘటనలు చూస్తున్నాం. కానీ ఎఫ్ టి ఎల్,బఫర్ జోన్ లో , సాగుకు యోగ్యంగా ఉన్న భూమిని తనకు అనుకూలంగా లేదని అధికారుల తో చేతులు కలిపి తప్పుడు పత్రాలను సృష్టించి నాలా కన్వీర్షన్ చేసాడని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. బఫర్ జోన్ లో ఉన్న భూమి ని అందులో ప్లాట్లు గా విభజించి అమాయకుల ను ఎరగా చెసుకొని ప్లాట్లను తనకు ఇష్టం వచ్చిన రెట్లకు అమ్ముకుంటున్నాడని అంటున్నారు. అందులోనే అక్రమంగా రెండు షటర్ల తో బిల్డింగ్ నిర్మించి కామర్షియల్ గా వాటిని కిరాయిలకు ఇస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. అలాగే అవునూర్ చెరువులో ని నీరు పంటపొలాలకు వచ్చే క్రమంలో ఎక్కుగా వచ్చిన నీటిని వాగులోకి వదిలే ఒర్రె కాలువను కూడా ఇరిగేషన్ అధికారుల కనుసన్నాళ్ళో కబ్జా చేసి నిర్మాణాలు చేసాడు. మురుగు నీరు వాగులోనికి వదులుతున్నాడు ఇంత తతంగం నడుస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహారిస్తున్నారు.ఈ వెంచర్ గుండా మండల అధికారులు రోజు విధులకు వెళ్లే మార్గం ప్రక్కనే ఉండడం విశేషం. రియల్టర్ కు అధికారుల అండగా ఉన్నారని వారికీ చేతులు తడిస్తేనే పనులవుతున్నాయా….?అని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రియల్టర్ వ్యాపారి దందకు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఓ,తహసీల్దార్ ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారుల పై చర్యలు తీసుకొని అమాయకపు ప్రజలు మోసపోకుండా కాపాడలని కోరుతున్నారు.ఈ దందకు పోలిస్టాప్ పెట్టాలని,విజ్ఞప్తి చేస్తున్నారు.

*మరో కథనం తో 2వ భాగం*

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share