ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చికెన్ వ్యర్ధాల మాఫియా…

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చికెన్ వ్యర్ధాల మాఫియా…!

పేరుకు చెత్త కోట్లల్లో వ్యాపారం..!!

*కాసులకు ఒక కక్కుర్తి పడి పచ్చి మాంసాన్ని చేపలకు ఆహారంగా వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్న బడా వ్యాపారులు
ప్రజావాణి వరుస కథనం..4

ఖమ్మం బ్యూరో ప్రజావాణి
మార్చి 18:

ఖమ్మం కేంద్రంగా ఆంధ్ర తెలంగాణ లో భారీ చికెన్ వ్యర్ధాల దందా గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతుండగా నెలనె ల లక్షలాది రూపాయలు కమిషన్ల రూపంలో కొందరు అవినీతి అధికారులకు అందుతుందనేది బహిరంగ రహస్యమేన ని పలువురు జిల్లా ప్రజలు నిపుణులు ఆరోపిస్తున్నారు.
చికెన్‌ వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలం వేసిన ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఏకంగా 93 లక్షలకు ఈ పాట నిర్వహించడం జరిగిందని విశ్వాసనీయ సమాచారం మేరకు తెలిసింది.
చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే వ్యర్ధాలను ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు ఆంధ్రాలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.
చికెన్‌ వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలం
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో
ఏ ఆర్ ఫిష్ ప్రొడక్షన్స్ పేరుతో హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ సంస్థ పేరుతో ఆయేషా ట్రేడర్స్ మహమ్మద్ జాఫర్ అలీ అంబర్పేట హైదరాబాద్ వారు ఈ టెండర్ను దక్కించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యర్ధాలను ఆంధ్రకి తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ది బహిరంగ రహస్యమేనని పలువురు బహిరంగంగా అంటున్న గాని చర్యలు తీసుకునేందుకు అధికారులు తర్జన భర్జన పడుతున్న సందర్భంగా అధికారుల పనితీరును తెలియజేస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం అర్బన్ పరిధిలో సుమారు 400 చికెన్ సెంటర్లు ఉండగా అర్బన్ పరిధి వరకు వేలం నిర్వహిస్తే రూరల్ ఏరియా పరిస్థితి ఏంటనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి.
ఖమ్మం పరిసర ప్రాంతాలు ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి ముదిగొండలో జగ్గయ్యపేటకు చెందిన మల్లేశం అనే వ్యక్తి ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా సుమారు ఒక రోజుకు రెండు నుంచి నాలుగు టన్నుల వ్యర్ధాలను నేలకొండపల్లి మీదిగా ఒక వాహనం ఖమ్మం రూరల్ నుండి ముదిగొండ మండలాల మీదుగా మరో వాహనాన్ని జగ్గయ్యపేటకు తరలించి తరలిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో బోనకల్లు చింతకాని మధిర వైరా సత్తుపల్లి కల్లూరు ఏరియాలలో విస్తృతంగా చే పల చెరువులు వెలిశాయి. చే పలు ఎదుగుదలకు ఆహారంగా చికెన్ వ్యర్ధాలు అధిక మొత్తంలో అందుబాటులో ఉండటంతో ఓ కంపెనీ పేరుట ఈ చేపలు చెరువుల వారు అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు.
కార్పొరేషన్, అర్బన్ ఏరియా కు చెందిన చికెన్ వ్యర్ధాలను వేలంపాట్లో దక్కించుకున్న కంపెనీ వారు సేకరించిన వ్యర్థాలనుచిన్న చిన్న ట్రక్కులు ద్వారా సేకరించి ఖమ్మం కేంద్రంగా నూతన కలెక్టరేట్ భవనం వెనుక వెంచర్లలో ఈ ముఠాకు చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి సమయంలో కంటైనర్ల ద్వారా సుమారు ఒక రోజుకి 40 నుంచి 80 టన్నుల కోడి మాంసం వ్యర్ధాలను ఆంధ్రకు చెందిన చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న గానీ పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share