
*వాట్సాప్, ఫేసుబుక్ లో అసభ్యకరంగా పోస్ట్ పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు*
*సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై శ్రీకాంత్ గౌడ్*
*ఇల్లంతకుంట //మన ప్రజావాణి*
మానకొండూర్ ఎమ్మెల్యే పాత వీడియోస్ ను అసభ్యకరంగా ఎడిట్ చేసి ఇతరులను రెచ్చగొట్టే విధంగా పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కముటం శ్రీధర్ అనే వ్యక్తి వాట్సాప్ లో, అదే గ్రామానికి చెందిన పసుల బాబు అనే వ్యక్తి పేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినారాని ఇల్లంతకుంట మండలానికి చెందిన భూంపల్లి రాఘవరెడ్డి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండలంలో ఎవరైనా ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో వీడియోస్ గాని, అసభ్యకరమైన, రెచ్చగొట్టే రాతలు రాసి పోస్టులు పెట్టినట్లయితే వారిపై చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ప్రకటన ద్వారా హెచ్చరించారు.