అభివృద్ధి పేరుతో నిధులు గల్లంతు లేబర్ కు చెందాల్సిన డబ్బులు పక్కదారి పట్టించిన వైనం… ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు చింతకాని మండలం చిన్నమండవ లో నేటికీ అందని డబ్బులు న్యాయం చేయాలని కోరుతున్న ముఠా సభ్యులు, ట్రాక్టర్స్ యజమానులు
లేబర్ కు చెందాల్సిన డబ్బులు పక్కదారి పట్టించిన వైనం…
ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు
చింతకాని మండలం
చిన్నమండవ లో నేటికీ అందని డబ్బులు
న్యాయం చేయాలని కోరుతున్న ముఠా సభ్యులు, ట్రాక్టర్స్ యజమానులు
ఖమ్మం బ్యూరో ప్రతినిధి,మన ప్రజావాణి మార్చి 21
చింతకాని తహసిల్దార్ ఇచ్చిన ఇసుక రవాణా కూపన్ ల ద్వారా వచ్చిన నిధులను చిన్నమండవ గ్రామపంచాయతీ వారికి పంపించగా, అట్టి నిధులను, ముఠా కూలీలు ( లేబర్) ట్రాక్టర్ యజమానులకు చెందాల్సి ఉండగా, ఆ విధంగా గ్రామపంచాయతీ వారు , ముఠా కూలీలు( లేబర్ ), డబ్బులను పంపిణీ చేయకుండా అక్రమంగా పక్కదారి పట్టించి గతంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం లో 65 లక్షలు ఇష్టానుసారంగా అభివృద్ధి పేరుతో ఖర్చులు చేయడం జరిగిందని ఇసుక ముఠాలకు డబ్బులు పంచాలని అడగగా గ్రామ నాయకులు మీకు దళిత బంధు రాదు రానివ్వమని బెదిరించి మాకు గతంలో న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా మాకు న్యాయం జరిగిందనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయం చేసి ప్రస్తుతం రెండు నెలల క్రితం 15 లక్షల రూపాయలు నిధులను చిన్న మండవ గ్రామపంచాయతీ వారు పక్క దారి పట్టించి కాజేశారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ డబ్బులను లేబర్ కు చెందాల్చిన డబ్బులను గురించి గ్రామ పంచాయితీ వారిని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అదికార పార్టీ అండదండాలు ఉన్నాయి మేము చేపిందే వేద్దాం అంటూ తమకు రావలసిన సొమ్మును గ్రామ అధికార పార్టీ నాయకులు మరియు గత పాలకులు కలసిరాకుండ చేస్తున్నరని ఈ విషయంపై విచారణ జరిపి లేబర్కు రావలసిన డబ్బును ఇప్పించాలని ఇసుక ముఠా సభ్యులు ట్రాక్టర్ల యజమానులు కోరుతున్నారు. ఇంత మొత్తంలో లక్షల రూపాయలు కాజేసిన అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వాలు మారినాయి కూలీల డబ్బులు అందకపోవడంతో కూలీలు తీవ్ర నిరాశ నిష్పహాలలో జీవనం సాగిస్తున్న నేపథ్యం. ఇంతకీ అధికారులు చర్యలు తీసుకొని కూలీలకు న్యాయం చేస్తారా లేదా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉన్నది