
*బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్?
యాదాద్రి జిల్లా :మార్చి 21
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం తహశీల్ధార్ ను కలెక్టర్ హనుమంతరావు,ఈరోజు సస్పెండ్ చేశారు. బీబీనగర్ మండలం పడమట సోమారం,గ్రామంలో ఫీల్డ్ లో ప్లాంట్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్కు డేటా కరెక్షన్ ద్వారా పాస్ బుక్స్ జనరేషన్ కు బాధ్యులైన తాసిల్దార్ ను సస్పెండ్ చేశారు. రెవెన్యూ అధికారులు..
తహశీల్దార్ శ్రీధర్ ఖాళీ స్థలానికి పాసు పుస్తకం జారీచేసిన విషయమై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఆయనపై సస్పెండ్ వేటు పడింది. బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రెవెన్యూ శాఖలో అక్రమాల పర్వం ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఇటీవల మోతే మండలం తహశీల్ధార్ సంఘమిత్ర సహా ఆర్ఐ, మీ సేవ నిర్వాహకులు పహాణీల టాంపరింగ్ కేసు లో సస్పెండ్ కు గురికాగా, పోలీసు కేసులతో రిమాండ్ కాబడ్డారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025