
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://*
*వాట్సాప్ లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు, మొబైల్ ఫోన్ సీజ్..*
*రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు ఎస్సై రామ్మోహన్..*
మన ప్రజావాణి
తంగలపల్లి మండలంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో తన మనోభావాలు దెబ్బతినేవిధంగా, తనను కించపరిచేవిధంగా రామచంద్రపూర్ నివాసుడు బొడ్డు శ్రీధర్ s/o దుర్గయ్య పోస్టులు పెట్టాడని చిన్న లింగపూర్ గ్రామానికి చెందిన బైరినేని రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా ఆదివారం నిందితుని వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనపర్చుకొనైనది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిదంగా రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా లో ఎవరైనా పోస్టులు పెట్టినట్టైతే కఠినమైన చర్యలు తీసుకోబడునని తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు..
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025