
*✒️- శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం*
*శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే*
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025