*ట్రంప్‌కు గుడ్ బై చెప్పనున్న మస్క్ – టెస్లా కోసమే !*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

**ట్రంప్‌కు గుడ్ బై చెప్పనున్న మస్క్ – టెస్లా కోసమే !*

అంతరిక్షాన్ని అందుకోవడానికి అక్కడ వ్యాపార సామ్రాజ్య స్థాపనకు ట్రంప్ సాయం చేస్తారని ఆయనతో కలిసి రాజకీయం ఎలాన్ మస్క్ కు భూమి మీద ఉన్న వ్యాపారాలు ఎత్తిపోయే ప్రమాదం ఉందని ఇప్పుడు తెలిసి వస్తోంది. టెస్లా అమ్మకాలు దారుణంగా పడిపోతున్నాయి. ట్రంప్ మోడలింగ్ చేయడం కూడా కలసి రాలేదు. ఆయనపై అమెరికా వ్యాప్తంగా ఓ ద్వేషభావం ఏర్పడింది. అందుకే ఎవరూ కొనడం లేదుసరి కదా.. కొన్ని చోట్లా టెస్లా షోరూములపై దాడులు చేస్తున్నారు.

మరో వైపు పోటీ ఈవీ వాహన సంస్థలు కొత్త కొత్త మోడల్స్ లో మార్కెట్లోకి దూసుకువస్తున్నాయి. కొంత కాలంగా టెస్లా నుంచి కొత్త మోడల్స్ రావడం లేదు. పాత మోడల్స్ పై కొనుగోలుదారులకు ఆసక్తి తగ్గిపోయింది. బీవైడీ ఇప్పటికే మార్కెట్ లో టెస్లా కంటే ఎక్కువ షేర్ సాధించింది. ఆ కంపెనీ రాకెట్ స్పీడ్ తో అభివృద్ధి చెందుతోంది. ఇపుడు ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అయినా సరే ట్రంప్ కు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.

డోజ్ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త విభాగానికి ఎలాన్ మస్క్ చీఫ్ గా ఉండి.. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ రద్దు చేయాలని సిఫారసు చేస్తూ వస్తున్నారు. చివరికి విద్యాశాఖ రద్దు వెనుక కూడా ఆయన సిఫారసు ఉంది. ఉద్యోగులు ఎవరూ పని చేయరని అందర్నీ తీసేయాలని ఆయన సలహాలిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలతో ఆయన పూర్తిగా వివాదాస్పదమయ్యారు. అదే ఆయనపై వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఇప్పుడు డోజ్‌కు గుజ్ బై చెప్పినా పరిస్థితి సానుకూలంగా మారుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share