
భార్య ను కాపాడుకోవాలని అప్పు చేసి…….మృతి
రాజన్న సిరిసిల్ల//మన ప్రజావాణి
భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఎలాగైనా కాపాడుకోవాలని తెలిసిన వారి దగ్గర అప్పుచేసి వాటిని ఎలా తీర్చాలో అని దీనస్థితిలో మనస్థాపానికి గురై భర్త ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది.
*పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం*
సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన ఎర్రం కొండయ్య (56 సం) లు, అనునతడు తన భార్య ఎర్రం పుష్పలత యొక్క ఆరోగ్యం గత 5 సంల నుండి బాగు లేనందున ఆసుపత్రిలో తీసుకు వెళ్ళుటకు అప్పులు చేసి వాటిని ఎలా తీర్చాలని మన స్థాపనికి గురై ఇంట్లో ఎవరు లేని సమయములో సాయినగర్ లోని దర్గా ముందు గల చెట్ల పొదలలోకి వెళ్లి అక్కడ గల ఒక చెట్టుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.