
మన ప్రజావాణి// సూర్యపేట జిల్లా:
ఫిర్యాదుధారునికి వ్యతిరేకంగా నమోదయిన ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బదులుగా అతనికి భా.న్యా.సు.సం. లోని సె.35 క్రింద నోటీసు అందించడానికి అధికారిక అనుకూలతను చూపినందుకు ఆతని నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.10,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన సూర్యాపేట జిల్లా లోని చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం) రక్షకభటనిలయ అధికారి, ఎస్.ఐ అఫ్ పోలీస్ – ఎన్. అంతిరెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)” ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును