
మణుగూరు పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు
మణుగూరు సిఐ తో పాటు ఒక టీవీ రిపోర్టర్ అరెస్టు
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
ఒక కేసు విచారణలో భాగంగా నిందితుడుగా ఉన్న వ్యక్తి పేర్లను కేసు నుండి తప్పించేందుకు గాను రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ గా 1 లక్ష రూపాయలు మణుగూరు కు చెందిన బిగ్ టివి రిపోర్టర్ మిట్టపల్లి గోపి ద్వారా తీసుకుంటున్న క్రమంలో విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు డిఎస్పి వై రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. సీఐ సతీష్ కుమార్ మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మధిర టౌన్ ఎస్ఐ గా పని చేసి పదోన్నతి పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పనిచేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అదుపులోకి తీసుకున్న సీఐ సతీష్ కుమార్ బిగ్ టీవీ రిపోర్టర్ గోపీలను ప్రత్యేక ఎసిబి కోర్టు వరంగల్ ఎదుట హాజరుపరచనున్నట్లు ఎసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపారు.
విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటున్న సతీష్ కుమార్ పై కొంతమంది మణుగూరు కు చెందిన వ్యక్తులు చేసిన కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరిగినట్లు స్థానికంగా మీడియా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.