*మంథని సబ్ రిజిష్టార్‌ పై నాన్ బెయిలబుల్ కింద నమోదు* |

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

| *మంథని సబ్ రిజిష్టార్‌ పై నాన్ బెయిలబుల్ కింద నమోదు* | పెద్దపల్లి, ఏప్రిల్ 23 (మన ప్రజావాణి): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్‌ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది

April 23, 2025 /
| మంథని సబ్ రిజిష్టార్‌ పై నాన్ బెయిలబుల్ కింద నమోదు
| పెద్దపల్లి, ఏప్రిల్ 23( మన ప్రజావాణి): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్‌ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంథని మున్సిపల్ పరిధిలోని ఎరుకల గూడెం లోని ఎస్ఆర్ కె అపార్ట్మెంట్ ఏరియాలోని పడావు పడ్డ భూమి ఉంది. దానినిని ప్రభుత్వ భూమా లేక పట్టా భూమా అని నిర్దారణ చేయకుండానే, ఎటువంటి లింక్ దస్తావేజులు లేకుండానే, సర్వే నంబర్ పేర్కొనకుండా, రేకుల షెడ్ ఉన్న స్థలాన్ని ఖాళీ స్థలంగా పేర్కొన్నారు.
ప్రభుత్వ, మున్సిపల్ అదాయానికి గండి కొట్టి కొందరు పక్కనే ఉన్న తమ ఇంటి నంబర్ వేసి బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.50 లక్షల విలువ చేసే రెండు గుంటలకు పైగా ఉన్న విలువైన స్థలాన్ని రెండు గిప్ట్ డీడ్ ల పేరిట మంథని సబ్ రిజిష్టార్‌ రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం పై ఈ కేసు నమోదైంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లగా మంథని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు

అంతకుముందే పెద్దపల్లి కలెక్టర్ విచారణ జరిపించి మంథని సబ్ రిజిష్టార్‌ ముజిబర్ రెహ్మాన్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ఉండడమే కాకుండా విధులలో మోసపూరితంగా, దురుద్దేశ్య పూర్వకంగా విధులు నిర్వహించినందుకు, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా రెవెన్యూ శాఖకు అట్టి భూమిపై వివరాలు కోరడం, ఆ తర్వాత అట్టి గిప్ట్ డీడ్ దస్తావేజుల రద్దుకు చలాన్, రద్దు దస్తావేజు తయారు చేయడంతో పాటు భాధ్యతయుతమైన ప్రభుత్వ అధికారి అయి ఉండి సమస్యలను సృష్టించినందుకు కేసు ఫైల్ చేయవలసిందిగా పెద్దపల్లి కలెక్టర్ మెమో ఇచ్చారు.

దీంతో స్పందించిన కమిషనర్ ఎన్ మనోహర్ మంథని సబ్ రిజిస్టారర్ పై కేసు నమోదు చేయాలని ఈనెల 16న లేఖ నంబర్ A1/06/2025 ప్రకారం మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా గా అదేరోజు మంథని సబ్ రిజిష్టార్‌ ముజిబర్ రెహ్మాన్ పై భారతీయ న్యాయ సంహిత (BNS)316(2),318(4) నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటికీ రిజిస్టర్ మాత్రం ప్రతిరోజూ విధులకు హాజరు కావడం, పలు దస్తావేజులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా రిజిష్టార్‌పై కేసు నమోదు విషయం ఆలస్యంగా వెలుగు వచ్చింది.

సబ్ రిజిస్ట్రార్ ను అరెస్టు చేయాలి
🔵🟢🔴.
అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన యవ్వారంలో ప్రభుత్వాన్ని మోసం చేసి,ప్రభుత్వ అదాయానికి గండి కొట్టి, తప్పుడు సమాచారంతో గిప్ట్ డీడ్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకొన్న, బాధ్యులైన వ్యక్తులను కూడా కేసులో నిందితులుగా చేర్చాలని, కేసు నమోదు అయిన సదరు సబ్ రిజిష్టార్‌ను వెంటనే అరెస్ట్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇనుముల సత్యనారాయణ డిమాండ్ చేశారు. అట్టి స్థలంలో మున్సిపల్, ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, ఎవరికీ సంబంధం లేని అట్టి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share