👉అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

👉అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

👉 కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామంలో కేటీఆర్ సేన గ్రామ శాఖ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నియామకం జరిగింది.

నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా బాలసాని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బోణిగని మహిపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా చిట్యాల రాజశేఖర్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బట్కు అజయ్ యాదవ్, కార్యదర్శిగా మిడిదొడ్డి శ్రీకాంత్, కోశాధికారిగా రేగుల సురేందర్‌లను నియమించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన కేటీఆర్ సేనను బలోపేతం చేస్తూ, యువతలో చైతన్యాన్ని నింపే విధంగా పలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

నూతనంగా ఎన్నికైన కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులు బాలసాని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల కనకయ్య, సీనియర్ నాయకులు కురుమ రాజయ్య, మాజీ సర్పంచ్ అడ్డగట్ల భాస్కర్, తాజా మాజీ ఎంపీటీసీ కరికవేణి కుంటయ్య, సీనియర్ నాయకులు సావనపల్లి బాలయ్య, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share