పులిహార కలపడానికి ఇంటికి వెళ్ళి కడుపు చేసిన వంట మేస్త్రి.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

పులిహార కలపడానికి ఇంటికి వెళ్ళి కడుపు చేసిన వంట మేస్త్రి.

న్యాయం కోసం నిండు గర్భిణీ కొన్ని రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. గర్భిణీ గా ఉన్న సమయంలో తగిన పౌష్టికఆహారం తీసుకొని ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో……. ఐదు నెలల నిండు చూలాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ న్యాయం చేయండి అని వేడుకుంటుంది…. అయినా మచిలీపట్నం పోలీసులు అదిగో ఇదిగో నంటూ పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారు.
ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని వెడుకుంటున్న పోలీసులు కానికరించడం లేదు, ఇందుకు కారణాలు ఏమయి ఉంటుందో వారికే తెలియాలి.

మహిళలను ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా మోసానికి పాల్పడుతున్నా కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. వారిలో అంజమ్మ కాలనీకు చెందిన వంట మేస్త్రి ఒకడు.

అంజమ్మ కాలనీ లో సుధాకర్ నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా ఇతను వంట మేస్త్రి. అదే ప్రాంతంలో భార్గవి అనే మహిళ నివాసం ఉంటుంది. పక్కపక్క ఇల్లు కావడంతో తరచూ భార్గవిని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

ఓ రోజు పులిహార కలపడం నేర్పిస్తాను అని ఇంటికి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఆ మహిళను లోబరుచుకున్నాడు…..ఇలా తరచూ వెళ్లి శారీరకంగా ఒకటవుతున్నారు…… కొన్ని రోజులకు భార్గవి గర్భం దాల్చింది……. గర్భం వచ్చాక భార్గవి వంట మేస్త్రి ను నిలదీస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించాడు.

మచిలీపట్నంలో మహిళలకు న్యాయం చేస్తానంటూ చెప్పుకుంటున్న ఓ మహిళ దగ్గరకు సుధాకర్ వెళ్లాడు. జరిగిందంతా చెప్పాడు….. మహిళకు మహిళ శత్రువు అనే నానుడి ఇక్కడ సరిగ్గా ఉదాహరించవచ్చు. సుధాకర్ వలన గర్భం దాల్చిన భార్గవికు న్యాయం చేయాల్సిన మహిళ శీలానికి వెలకట్టింది. మూడు లక్షల రూపాయలు భార్గవికి ఇవ్వాలని చెప్పి సుధాకర్ దగ్గర తీసుకొని (న్యాయం చేసే మహిళ) ఆ మహిళ బొక్కేసింది. పైగా పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు మంచివారు కాదంటూ నీ దగ్గర నుండి ఇంకేదో ఆశిస్తారని మహిళను బెదిరించింది. ఏది ఏమైనా నగరంలో అన్యాయాలు ,అక్రమాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు న్యాయం చేస్తామంటూ చట్టబద్ధతలేని సెటిల్మెంట్ కేంద్రాలు కనిపిస్తున్నాయి.

సుధాకర్ తనను పెళ్లి చేసుకోవాలని భార్గవి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది…. వేచి చూడాలి మచిలీపట్నం పోలీస్స్టేషన్లో భార్గవి కు న్యాయం జరుగుతుందో లేదోనని.

మహిళలు తస్మాత్ జాగ్రత్త

మహిళలను నమ్మబలికించి మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడేవారు కొంతమంది పురుషులు (మనుషుల రూపంలో) మన పక్కనే తిరుగుతూ ఉంటారని మహిళలు గమనించాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share