పందిళ్ళపల్లి మత్స్య సహకార సొసైటీ అక్రమాలను అరికట్టాలి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

పందిళ్ళపల్లి మత్స్య సహకార సొసైటీ అక్రమాలను అరికట్టాలి
— సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీని రద్దు చేయాలి
— కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న మత్స్య శాఖ ఏడి
— విలేకరుల సమావేశంలో బాధితులు

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

చింతకాని మండల పరిధి లోని పందిళ్ళపల్లి (పెద్దచెరువు) మత్స్య సహకార సొసైటీలో గత 12 ఏండ్లుగా జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, వారసత్వ సభ్యత్వం పేరుతో వసూళ్లకు పాల్పడిన సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీని రద్దు చేయాలని బాధితులు సింగారపు వీరమల్లు, సింగారపు వీరభద్రం, లింగం సైదులు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పందిళ్ళపల్లి (పెద్దచెరువు) మత్స్య సహకార సొసైటీలో సుమారు 149 మంది సభ్యులు ఉన్నారన్నారు. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా లింగబోయిన వెంకటేశ్వర్లు(బుజ్జి), షేక్ సైజాని, 9 మంది సభ్యులు ఉన్నారన్నారు. *సొసైటీ 149 మంది సభ్యులలో సుమారు 48 మంది తండ్రులు చనిపోతే వారసత్వంగా వారి కొడుకులకు సభ్యత్వం పేరుతో రూ. 6వేల నుండి ఎక్కువ మొత్తంలో వసూలు చేసి సభ్యత్వం ఇవ్వకుండా మత్స్య శాఖ ఏడికి ఇతరులకు ఇచ్చామని 12 ఏళ్లుగా కాలయాపన చేస్తూ మోసం చేశారని విమర్చ్చించారు.ఇట్టి విషయమై మత్స్య శాఖ ఏడికి మూడుసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. గ్రీవెన్స్ లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ ఆదేశాలు కూడా మత్స్యశాఖ ఏడి బేఖాతర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ సభ్యత్వం పేరుతో నాలుగైదు లక్షలు, అదేవిధంగా కొత్త సభ్యుల పేరుతో 50 మంది దగ్గర రూ.50 వేల రూపాయలను పందిళ్ళపల్లి మత్స్య శాఖ సహకార సొసైటీ, మత్స్యశాఖ ఏడి సహకారంతోనే ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఏడి సస్పెండ్ అయిన అధికారులకు బుద్ధి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్