ఆరెగూడెం చెరువులో విష ప్రయోగం..? సుమారు రెండు టన్నుల చేపలు మృతి…!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఆరెగూడెం చెరువులో విష ప్రయోగం..?

సుమారు రెండు టన్నుల చేపలు మృతి…!

స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మత్స్యకారులు

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామం‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత పదార్థం కలపడంతో చెరువులోని చేపలు భారీగా మృతి చెందాయి. అంచనా ప్రకారం దాదాపు రెండు టన్నుల మేరకు చేపలు చనిపోయినట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు.
ఈ ఘటనపై మత్స్య పరిశ్రమ సహకార సంఘం సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులో మృత చేపల సంఖ్య, వాటి విలువ చూసిన గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా గ్రామంలోని మత్స్యకారులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా ఇది మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని
ఎంతో ఆశతో చేపల వృద్ధికి శ్రమించామని ఒక్కసారిగా ఈ విధంగా నష్టం కలగడం క్షమించరానిదని సంఘ సభ్యులు అన్నారు.ఈ ఘటన పునరావృతం కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. కాగా నీటిమట్టం తక్కువగా ఉండటంతో చేపలు చనిపోయినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share