నేడు అప్పల నరసింహాపురం గుట్టల్లో కాలుష్య నియంత్రణ మండలి విచారణ..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

నేడు అప్పల నరసింహాపురం గుట్టల్లో కాలుష్య నియంత్రణ మండలి విచారణ..?

కెమికల్ ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ వ్యవహారంలో రైతుల ఫిర్యాదు మేరకు రానున్న అధికారులు..?

మన ప్రజావాణి సంచలన కథనాలకు రెండవ దశ విచారణకు రంగం సిద్ధం..?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల పరిధిలోని అప్పల నరసింహపురం గుట్టల్లో ఓ రెండు ఫ్యాక్టరీల వ్యవహారంపై స్థానిక గ్రామ రైతుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత కొన్ని నెలల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆనాటి తాహ సిల్దార్ వ్యవసాయ అధికారులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేసి తహసిల్దార్ నేతృత్వంలో ప్రాథమిక విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సంచలన కథనాలకు స్పందనగా కాలుష్య నియంత్రణ మండలి శాఖ అధికారులు నేలకొండపల్లి మండల పరిధిలోని అప్పల నరసింహపురం గ్రామానికి నేడు క్షేత్రస్థాయిలో విచారణకు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. నాటి తాహ సిల్దార్ నేతృత్వంలోని విచారణలో రైతుల ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం జల వాయు కాలుష్యాలు ఆరోగ్య సమస్యలపై అందిన ఫిర్యాదులు మేరకు విచారణ చేసి వాస్తవమేనని దృ వీకరించినట్లు తెలుస్తోంది. కాగా అధికారులు నేటి విచారణకు హాజరుకానున్నట్లు తెలిసిన నేపథ్యంలో యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. గ్రామపంచాయతీ రికార్డులను నమోదు కాకుండా కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై మన ప్రజాపాణి తెలుగు దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి వీరభద్రం అనేక సంచలన కథనాలను వరుసగా అందించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికారులకు తెలిసిందే. ఇటీవల కొందరు బాధితులు హైదరాబాదులోని కాలుష్యాన్ని నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మన ప్రజావాణి కథనాలకు స్పందనగా క్షేత్రస్థాయిలో రెండో దఫా విచారణకు అధికారులు రానున్నట్లు తెలుస్తోంది. నాకీ తాహ సిల్దార్ విచారణ సమయంలో మరో 15 రోజుల్లో డివిజనల్ రెవిన్యూ అధికారి విచారణకు వస్తారని ప్రకటించి నెలలు గడుస్తున్న సందర్భంలో రైతుల ప్రజల ఆవేదన మేరకు మన ప్రజావాణి సంచలన కథనాలను విచారణ తర్వాత కూడా అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే విచారణలో రైతులు చేసిన ఫిర్యాదులు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి బాధిత రైతులకు న్యాయం చేయాలని నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share