
*భీమదేవరపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొలువు దీరనున్న 'రాజు' ఎవరో*
*ఇప్పుడైనా అధ్యక్ష పదవి బీసీలను 'ఆదరి'0చేనా!*
భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన ప్రజావాణి మే 23
భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు పార్టీ పదవుల కోసం దాదాపుగా మండలం నుండి 200 అప్లికేషన్లు రావడం జరిగింది.మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ శాఖ, పట్టణ శాఖ,అధ్యక్ష పదవుల కోసం గ్రామాల వారిగా ఆశావాహులు ముందుకు రావడం జరిగింది.మక్సుద్ పీసిసి పరిశీలకునికి దరఖాస్తులు అందించడం జరిగింది.జూన్ మొదటి వారంలో ఎవరికి ఏ పదవులు వస్తాయో తెలియనుంది.
మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి కై బీసీల నుండి ఆశావాహులు ఎక్కువయ్యారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిట్టెంపల్లి ఐలయ్య పదవి కాలం ముగియడంతో ఈసారి బీసీలకే పదవి దక్కుతుందని ఆశ పడుతున్నారు.గ్రామ శాఖ మండల శాఖ బ్లాక్ కాంగ్రెస్కు సీనియర్లలో పోటాపోటీగా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది.
మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా న్యాయకత్వ లేమితొ మండలంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి సరియైన వ్యక్తికి మండలాధ్యక్ష పదవి అప్పగించి మండలంలో ఉన్న పార్టీ శ్రేణులను ఏకతాటి పైకి తీసుకువచ్చే నాయకత్వం కోసం పార్టీ అధిష్టానం సరియైన నాయకున్ని పైరవీ రాజకీయాలు లేకుండా సీనియార్టీని నాయకత్వ ప్రతిభను గుర్తించి ఎన్నుకోవడం కత్తి మీద సామే.
భీమదేవరపల్లి మరియు ఎల్కతుర్తి రెండు మండలాలకు సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ విషయంలోనూ రెండు మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.రెండు మండలాలు నాయకులను బుజ్జగించి బ్లాక్ కాంగ్రెస్ ఎవరికి వరిస్తుందో మంత్రి దీవెనలు ఎవరికి ఉంటాయె అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్రుత మొదలైంది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025