కోట్లాది రూపాయల ప్రభుత్వ పనులకు ప్రైవేటు ఏజెన్సీ నాణ్యత చూస్తారట..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

కోట్లాది రూపాయల ప్రభుత్వ పనులకు ప్రైవేటు ఏజెన్సీ నాణ్యత చూస్తారట..?

పర్యవేక్షణ ఆయా జిల్లాల పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు..?

ఆ ఏజెన్సీ ఎండి 2029 ఎన్నికల్లో ఓ నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట..?

నాడు ఓ మంత్రితో అంటగాగిన ఆ ఎండి ఇప్పుడు మరో నేతతో ప్రయాణం..?

వరంగల్ మహబూబాబాద్ నల్లగొండ సూర్యపేట కేంద్రాలలో ఏజెన్సీకి నాణ్యత ప్రమాణాలు చూసే బాధ్యత అట..?
చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..?

ప్రశ్నిస్తే అంతు చూస్తామంటున్న ఆ ఏజెన్సీ నిర్వాహకుడు..?

లొకేషన్ చెప్పు మీదో పత్రిక
అంటూ వీరంగం..?

తెలంగాణలోని ఓ జిల్లా రిపోర్టర్ చేతిలో ఎండి బూతు పురాణం..?

ఏ నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలు చూస్తున్నారు ఉన్న అనుమతులు ఏంటి..?

ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం

బ్లాక్ మెయిలింగ్ కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఆ ఏజెన్సీ…!

స్టేట్ బ్యూరో (మన ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఏజెన్సీ పంచాయతీరాజ్ నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేలో జరుగుతున్న వేలాది కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు టెండర్లు వేసి నిర్మాణ పనులు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ కాంట్రాక్టులు చేసే పనుల్లో నాణ్యత ఉన్నది లేనిది తీర్చేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఓ ప్రైవేటు ఏజెన్సీకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కట్టబెట్టి పంచాయతీరాజ్ మండల జిల్లా డివిజనల్ అధికారులు కొమ్మక్కుతో దర్జాగా శాంపిల్స్ సేకరించి అంతా బాగుంది నో ప్రాబ్లం అంటూ దృవీకరణ ముద్రలు వేయడంతో నాణ్యత ఉన్న నాణ్యత లేకున్నా బిల్లులు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లింపులకు మార్గం సులువు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలపై క్వాలిటీ కంట్రోల్ పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నిస్తే అవినీతిలో భాగమైన కొందరు అధికారులు ఈ విషయాన్ని నిర్వాహకులకు చేరవేయడంతో ఇదే విషయంపై ప్రశ్నించిన మన ప్రజావాణి స్టేట్ ప్రతినిధికి బెదిరింపుల పర్వం ఎదురయింది. అదేంటి మీకు ఉన్న నిబంధనలు ఏ ప్రాతిపదికన క్వాలిటీ పనులు నిర్వహిస్తున్నారని సదరు ఏజెన్సీ ఎం.డి ప్రశ్నించగా ప్రజావాణి ప్రతినిధిపై బెదిరింపులకు పాల్పడిన నేపథ్యం. ఎక్కడున్నావు..? ఏ ఏరియా మీది..? మీ కుటుంబం జాగ్రత్త..! నీ సంగతి చూస్తా అంటూ వీ రంగం వేయటం విశేషం..

పూర్తి వివరాలతో కథనంలో..2లో వేచి చూడండి సమగ్ర విశ్లేషణాత్మక కథనాలు..!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share