*ప్రమాదకరంగా మర్రిపెల్లి బ్రిడ్జి పరిసరాలు…ప్రయాణికులకు తప్పని తిప్పలు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ప్రమాదకరంగా మర్రిపెల్లి బ్రిడ్జి పరిసరాలు…ప్రయాణికులకు తప్పని తిప్పలు*

*వేములవాడ రూరల్ బిజెపి అధ్యక్షులు బూరుగుపెల్లి పరమేష్*

*మన ప్రజావాణి// వేములవాడ,మే – 24*

వేములవాడ రూరల్ :రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మర్రిపెల్లి బ్రిడ్జి కి రెండు వైపులా రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పాడి వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. బ్రిడ్జి పూర్తయి సంవత్సరకాలం అయినప్పటికీ రోడ్డు వేయకుండా వదిలి వేయడంతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు.వర్షం కురవడంతో గుంతలలో వాన నీరు నిలిచి బురదతో రోడ్డు అధ్వానంగా మారీ వాహన దారులకు చుక్కలు చూపెడుతున్నాయి ఈ సందర్బంగా వేములవాడ బీజేపీ రూరల్ అధ్యక్షులు బూరుగుపెల్లి పరమేష్ మాట్లాడుతూ ఉదయం పూటే ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణించాలంటేనే ఇంత ఇబ్బందిగా ఉంటే రాత్రిపూట అటు ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లూ బ్రిడ్జి రెండు వైపులా రోడ్డు దాటడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసి ఈ దుస్థితిని మార్చాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపు ప్రవీణ్ గుమ్మడి శ్రీనివాస్ లింగంపల్లి కుటయ్య పల్లికొండ నారాయణ ఆది జలంధర్ సుంకరి నరేందర్ తోట శేఖర్ మర్రిపల్లి బూతు అధ్యక్షులు లక్కం తిరుపతి మారం రాజేందర్ రాచర్ల రాజు విలాగరం మల్లయ్య గుమ్మడి బాలరాజు రాచర్ల రవి మానుపాటి రవి మానుపాటి సాయిలు బొమ్మెన బాబు పేరుక రమేష్ వంగపెల్లి రాజయ్య వంగపల్లి తిరుపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share