
మళ్లీ విజృంభిస్తున్న కరోనా …..! పెరుగుతున్న కేసులు..
మన ప్రజావాణి///
కరోనా మళ్ళీ విజృంభిస్తూ దాని కోరల్తో మళ్లీ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. గడచిన 24 గంటల్లోనే మహారాష్ట్రలో 43 కొత్త కేసులు నమోదు అయ్యాయి. జనవరి నుంచి ఆ రాష్ట్రంలో 300 కేసులు రావడం గమనార్హం. ఇక కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 273 కి చేరింది. ఆదివారం నాటికి తమిళనాడులో 66, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 కేసులు, యూపీ లో 4, కేసులు నమోదు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు కేసులు ఉన్నట్టు వెల్లడించారు.