
*దేవరకొoడలో టీజేఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ*
*నల్గొండ జిల్లా బ్యూరో/చండూరు మే 27 (మన ప్రజావాణి)*:
హైదరాబాదులోని జల విహార్ లో ఈనెల 31న జరిగే రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని టీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ దేవర కొండ జర్నలిస్టులకు పిలుపునిచ్చా రు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ను ఆయన టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురు పాదం, రాష్ట్ర కమిటి సభ్యులు, అన్నబోయిన మట్టయ్య, మీసాల నరహరి, తెంజు జిల్లా అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు వెంకటరెడ్డి, స ల్వాది జానయ్యలతో కలిసి ఆవి స్కరించారు.
మంగళవారం కొండ మల్లేపల్లి పట్టణంలోని హంస ప్రైవే ట్ థియేటర్ లో టీయూడబ్ల్యూజే దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొ మ్మినేని ఆంజనేయులు యాదవ్ అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూ జే డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేవరకొండ నియో జకవర్గం నుండి పెద్ద ఎత్తున జర్నలి స్టులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల సం క్షేమమే లక్ష్యంగా పనిచేసిన ఏకైక సంస్థ టీజేఎఫ్ అని, తెలంగాణ జ ర్నలిస్టుల అభ్యు న్నతి కోసం ఆవి ర్భవించిన సంస్థ టీజేఎఫ్ అని పే ర్కొన్నారు.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, అల్లం నారాయణ నేతృత్వంలో తె లంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించా రని గుర్తు చేశారు. జర్నలిస్టుల సం క్షేమం కోసం టీయూడబ్ల్యూజే ప్ర త్యేక కార్యాచరణను తీసుకువస్తుం దని అన్నారు. జర్నలిస్టుల సంక్షే మం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీ సుకువచ్చి జర్నలిస్టులకు లబ్ధి చే కూరేలా టీయూడబ్ల్యూజే , ఎల్లప్పు డు ముందంజలో ఉంటుందని అ న్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కా ర్యవర్గ సభ్యులు పాష, దేవరకొండ డివిజన్ కోశాధికారి సముద్రాల వే ణు, డివిజన్ నాయకులు వాంకు నావత్ సుభాష్, ముసిని అంజన్, నరేష్, నారాయణ, గిరి, బిజిలి లింగం, నల్లగాసు నవీన్ యాదవ్, దర్శనం విష్ణు, ముత్యాలు, రమేష్ చారి, భాను, సాయి, పోలగోని సైదులు, నంద్యాల వెంకటేశ్వర్లు, రాందాస్, అలీ, అంజి, రాంబాబు నాయక్, శంకర్, సైదులు, గాజుల వినయ్, వర్కాల పాండు, గోవిందు ప్రసాద్, సతీష్, హుస్సేన్, వెంక టేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.