ఓ అధికారి అండదండలతో కోదాడలో విచ్చలవిడిగా మట్టి రవాణా…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఓ అధికారి అండదండలతో కోదాడలో విచ్చలవిడిగా మట్టి రవాణా…?

వెంచర్లకు 24 గంటలు సరఫరా చేస్తున్నా మట్టి మాఫియా..?

ఒక్కొక్క ట్రిప్పుకు 700 నుండి 1000 రూపాయలు వసూళ్లు..?

అనుమతులు లేవు అంటున్నా కోదాడ తహసిల్దార్
సిబ్బందిని పంపించి అడ్డుకుంటామని వివరణ

యధావిధిగా రోజులుగా కొనసాగుతున్న తతంగం

ఖమ్మం -కోదాడ ప్రధాన రహదారిపై తమ్మర వద్ద మట్టి రవాణా..?

స్టేట్ బ్యూరో మన ప్రజావాణి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సమీపంలోని తమ్మర పరిధిలో రైస్ మిల్ గ్యాస్ కంపెనీ సమీపంలో ఖమ్మం కోదాడ ప్రధాన రహదారిపై గత కొన్ని రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో విచ్చలవిడిగా అక్రమ మట్టి రవాణా కొనసాగుతోంది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి వేళల్లో కూడా నిరంతరాయంగా మట్టి రవాణా జరుగుతున్న సంబంధిత మైనింగ్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగాలు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ శాఖ అధికారి అండదండలతో పర్యవేక్షణలో మట్టి అక్రమ రవాణా జరుగుతుందని నిర్వాహకులు వ్యాఖ్యానించటం విశేషం. ఏదైనా మట్టి అనుమతులు తీసుకోవాలంటే తప్పనిసరిగా మైనింగ్ అధికారుల నుండి దృవీకరణలు పొందాల్సి ఉండగా అటువంటివి ఏమీ లేకుండా గత కొన్ని రోజులుగా వెంచర్లకు ఇతర ప్రైవేటు భూమి అభివృద్ధి పనులకు బహిరంగంగా ప్రధాన రహదారిపై మట్టి అక్రమ రవాణా జరగటం విశేషం. మరోవైపు ట్రాక్టర్లతో ఇసుకను అక్రమార్కులు ఓ జాతర మాదిరిగా ప్రధాన రహదారిపై నిత్యం తరలిస్తున్నట్లు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఓ శాఖకు చెందిన అధికారి కనుసైగాలతో గత కొంతకాలంగా విచ్చలవిడిగా కోదాడ ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మన ప్రజావాణి ప్రతినిధి స్థానిక కోదాడ తహసిల్దార్ ను వివరణ కోరగా ఆ శాఖ అధికారులకు సంబంధం ఉండాలని ఏ లొకేషన్ లో ఎక్కడ జరుగుతోంది అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సిబ్బందిని పంపించి అడ్డుకుంటామని తహసిల్దార్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యధావిధిగా అక్రమ మట్టి రవాణా జోరుగా కొనసాగటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share