*రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి*

*— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి*

*— కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

*నల్గొండ జిల్లా బ్యూరో/చండూర్ జూన్ 1 (మన ప్రజావాణి)*:

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఇందుకుగాను అవసరమైతే రైన్ ప్రూఫ్ టెంటు వేయించాలని చెప్పారు. వివిధ శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా శకటాలను ప్రదర్శించాలని, అదే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, అత్యవసర సేవలను అందించే వైద్య ఆరోగ్య, ఫైర్, ఆర్అండ్ బి తదితర శాఖలు వారి శాఖల ద్వారా ముఖ్యమైన సేవలు ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని అన్నారు.రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని డీఈఓ ను ఆదేశించగా, వేడుకలకు వచ్చే వారందరికి కుర్చీలు, తాగునీరు, టెంట్లు,ఇతర ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల నిర్వహణలో భాగంగా పోలీస్ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల వివరాలను, షెడ్యూల్ ను తెలియజేస్తూ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఉదయం 9 గంటల 45 నిమిషాలకు క్లాక్టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మంత్రితో పాటు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తారని, ఉదయం 10 గంటలకు పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాక ఆవిష్కరణ, శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ సుదర్శన ఉంటుందని తెలిపారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డయాస్ తో పాటు, ఇరువైపుల ప్రముఖులు ప్రజలు, మీడియా, అధికారులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిన తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరేడ్ గ్రౌండ్లో మున్సిపల్ కమిషనర్, తసిల్దార్, రిజర్వు ఇన్స్పెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ద్వారా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమైన శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయా కార్యాలయాలలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఉద్యోగులందరూ పోలీస్ పరేడ్ మైదానంలో హాజరు కావాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో ఎస్ఈ ని కోరారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share