అవినీతికి అడ్డాగా… ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం…? లక్ష్యానికి దూరంలో ఆపసోపాలు…! సొంత బ్యాలెన్స్లు మాత్రం ఫుల్….?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

అవినీతికి అడ్డాగా… ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం…?

లక్ష్యానికి దూరంలో ఆపసోపాలు…!

సొంత బ్యాలెన్స్లు మాత్రం ఫుల్….?

మన ప్రజావాణి స్టేట్ బ్యూరో

పనికి ఓ రేటు.. కాసులు కురిపిస్తేనే సకాలంలో పనులు పూర్తి అవుతాయి. లేదంటే
నెలలు తరబడి కార్యాలయాలను చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ప్రైవేటు బ్రోకర్లు దళారులు ఏజెంట్లు అధికారుల అండదండలతో వాహనదారులను ముప్పు తిప్పలు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందని కొంతకాలంగా విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.రవాణా శాఖ కార్యాలయంలో ఓ ప్రధానాధికారి ప్రతి పనికి ఓ రేట్లు ఫిక్స్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వివిధ ఉద్యోగాలు వెలగబెట్టిన సదరు అధికారి ఖమ్మం జిల్లాకు చెందిన వారిని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రియ ల్ నాటికి రవాణా శాఖ వార్షిక ఆదాయం తగినప్పటికీ అధికారుల ఖజానా మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నదని పలువురు వాహనదారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మన ప్రజావాణి సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని జిల్లా అధికారులు అందుకోలేక ఆపసోపాలు పడుతూ వివిధ పనుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుండి ముక్కు పిండి మరి ప్రైవేటు ఏజెంట్లు కార్యాలయంలోని ఓ ఇద్దరూ అధికారులు ప్రైవేటు లావాదేవీలు నిర్వహిస్తూ దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టిఏ కార్యాలయాలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సరిపడా లేకపోవడం వాహనాల కొనుగోళ్లు తక్కువ కావడం కూడా నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయారని పలువురు పరిశీలకులు అంటున్నారు. 2023-24 లో వాహన జీవితకాలం పన్నుల లక్ష్యం 102.97 కోట్లు కాగా కేవలం 90 కోట్లు మాత్రమే సాధించినట్లు సాధ్యమైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-2025 లక్ష్యం 120 కోట్లు కాగా 99 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అవినీతి అధికారులు దళారులు బ్రోకర్లు వాహనదారుల నుండి ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి దండిగా దండుకుంటున్నట్లు జిల్లా ప్రధాన అధికారి అండదండలతో వ్యవహారం అంతా నిత్యం అదే తీరుగా కొనసాగుతుందని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

మరికొన్ని వివరాలతో తరు వాయి భాగం..2లో వేచి చూడండి…!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share