.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….!

పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..?

కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…?

చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..?

చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…?

మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

మత్స్యకారుల ప్రయోజనాలను మంటలో కలిపి బంధుప్రీతి లంచాలు పరమ అవధిగా మారి అవినీతికి చిరునామాగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య కోఆపరేటివ్ సహకార సంఘంపై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు విచారణలు జరిగి వేటుకు రంగం సిద్ధం చేసి రాష్ట్ర జిల్లా అధికారులు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఊసరవెల్లి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను విస్మరించి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి అడ్డంగా బుక్కై న ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు. అధికార యంత్రాంగాలను వ్యవస్థలను ప్రసన్నం చేసుకునే సత్తా శక్తి ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన పాలకవర్గ అధ్యక్షులు కార్యదర్శి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి దండిగా దండుకోనీ ఏమి ఎరగనట్లుగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై మన ప్రజావాణి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో తూటి పల్లి వీరభద్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుల ఆధారంగా బాధితుల మనోవేదన ఆగ్రహం ఆక్రందన లపై గత కొంతకాలంగా సంచలన కథనాలను మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో హై డ్రామా నెలకొన్నది. వార్త కథనాలకు స్పందించిన రాష్ట్ర జిల్లా స్థాయి యంత్రాంగాలు ఉదయం 10 గంటల లోపు మత్స్య సహకార సంఘానికి అధికారికంగా నోటీసులు జారీ చేయడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత మూడు సంవత్సరాల నుండి వసూలు రాజాగా మారి మత్స్యకారులను పీల్చి పిప్పి చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షుడు కార్యదర్శి సూచనల మేరకు వసూలు చేసి అడ్డంగా బుక్ అయినట్లు మత్స్యకారులు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి చాపల చెరువు వ్యవహారంలో గతం నుండి నేటి వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మత్స్యకారులను అన్యాయం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీట వేసిన వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో పనిచేసి వేటుపడిన మత్స్య శాఖ సహాయ సంచాలకురాలు సుమారు 21 గ్రామాల లోని మత్స్యకార సొసైటీల రికార్డులను గల్లంతు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. పందిళ్ళపల్లి వ్యవహారం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జిల్లా మత్స్యకారులు బాధితులు అంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share