చెరువు శిఖం భూమి ఆక్రమణ..! బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…? చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

చెరువు శిఖం భూమి ఆక్రమణ..!

బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…?

చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..?

ఎంత బడా బాబు అయితే మాత్రం.. ఇదేం నిర్వాకం..?

మరో పంచాయతీ కార్యదర్శి కారు చౌకగా చెరువును లీజుకి ఇస్తారు ఇక్కడ…?

ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఈ అక్రమాల మాటేమిటి…?

అసహనం వ్యక్తం చేస్తున్న రెండు గ్రామాల ప్రజలు

మన ప్రజావాణి “ప్రత్యేక” వరుస కథనం…1

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చెరువు శిఖం భూమిని సుమారు నాలుగు ఎకరాలు ఆక్రమించి దర్జాగా ఈ ఏడాది సాగు చేసుకునేందుకు కట్టలు పోపించి రంగం సిద్ధం చేసిన వ్యవహారం ఆ మండలంలో సంచలనంగా మారింది. స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి పోరాడిన నాటి బడా బాబు నేడు తన గ్రామానికి సమీపంలోని ఓ చెరువును ఆక్రమించి సుమారు నాలుగు ఎకరాలను గుప్పెట్లో పెట్టుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయంటూ ఏకంగా చెరువులో సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవహారం పరిసర గ్రామాలలో కలకలం రేపింది. స్వతంత్ర సంగ్రామంలో తనతో పాటు కొందరు పాల్గొన్నారని వారికి కూడా తనకున్న పరపతి పలుకుబడితో పెన్షన్లు మంజూరు అయ్యేటట్లు ప్రయత్నం చేసిన బడా బాబు ఓ మండల కేంద్రంలో మూడు నివాస గృహాలతో పాటు మరో నివాసగృహాన్ని నిర్మిస్తున్న ఘనుడు. అయినప్పటికీ తీసుకున్నది ప్రభుత్వ పెన్షన్ అయిన ఆదర్శంగా ఉండాల్సిన ఆ బడా బాబు రెండు గ్రామాలకు చెరువు ద్వారా సాగుకు ఉపయోగపడే చెరువును తన కబంధ హస్తాలలో బందీ చేసి నాలుగు ఎకరాలను స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేయటం అధికారుల పనితీరును తెలియజేస్తుందని పలువురు సన్నా చిన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వం చెరువులు కుంటలు ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో ఆ బడా బాబు చేసే నిర్వాకంతో ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుందని పలువురు రైతులు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ గ్రామపంచాయతీలోని చెరువును ఒకవైపు బడా బాబు ఆక్రమించి హస్త గతం
చేసుకుంటుంటే.. మరోవైపు ఆ చెరువును నామమాత్రం ధరకు సుమారు 20వేల రూపాయలకు చెరువును గుప్పెట్లో పెట్టారు. గతంలో కూడా సదరు వ్యక్తికి చేపలకు లీజుకు ఇచ్చినట్లు అదే వ్యక్తికి మళ్లీ సదరు పంచాయతీ అధికారులు కట్టబెట్టినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి.

మరికొన్ని అంశాలతో.. రెండవ
ఎపిసోడ్లో వేచి చూడండి…!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share