
బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
లంచం తీసుకుంటూ పట్టుపడ్డ కంప్యూటర్ ఆపరేటర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ అయిన సిహెచ్. నవక్రాంత్ ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బాధితుల సమాచారం మేరకు, రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి రూ. 4,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారుల తక్షణ స్పందనతో పక్కా వ్యూహం ప్రకారం తనిఖీ చేపట్టారు.
ఈరోజు (శనివారం) నవక్రాంత్ బాధితుల నుండి రూ. 2,500 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డిఎస్పి వై. రమేష్ ఆధ్వర్యంలో జరిపిన దాడిలో నేరానికి పాల్పడుతూ పట్టుబడ్డారు. అనంతరం నవక్రాంత్‌ను అదుపులోకి తీసుకొని మరింత లోతు గా విచారణ ప్రారంభించారు.