
కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఎస్సై,కానిస్టేబుల్ మృతి..
సూర్యాపేట జిల్లా కోదాడ,జూన్ 26/ మన ప్రజావాణి.
కేసు నిమిత్తం పోలీసులు ప్రైవేట్ కారును తీసుకొని హైదరాబాద్ వెళుతూ ముందు వెళుతున్న లారీని వెనకవైపు నుంచి ఢీకొట్టిన ఘటనలో ఓ ఎస్ఐ కానిస్టేబుల్ మృతి చెందారు. మరొక కానిస్టేబుల్ కు, కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలైన సంఘటన కోదాడ మండల పరిధిలోని దుర్గాపురం జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుంచి హైదరాబాదుకు కేసు విషయంలో పోలీసులు ఎర్టిగా ప్రైవేట్ కారును తీసుకొని వెళుతున్నారు. ఈ క్రమంలోని ఎన్ హెచ్ 65 జాతీయ రహదారిపై కోదాడ పట్టణంలోని దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద లారీ నీ వెనక వైపు నుండి కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ అర్మున్ బ్లెస్సిన్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి, ప్రైవేట్ డ్రైవర్ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే కోదాడ పట్టణ సీఐ శివశంకర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.