*_’స్థానిక’ పోరుకు లైన్‌క్లియర్‌..!!_*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*_’స్థానిక’ పోరుకు లైన్‌క్లియర్‌..!!_*

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.

ఇప్పటికే పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయ్యి 17 నెలల సమయం గడిచినా తిరిగి ఎన్నికలు నిర్వ హించని నేపథ్యంలో ఎట్టి పరిస్థితు ల్లో సెప్టెంబర్‌ నెలలోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు, మూడు నెలల కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, ఆశావహుల్లో సందడి మొదలైంది.

*_పల్లెల్లో పడకేసిన పాలన.._*

గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరగ్గా.. గతేడాది ఫిబ్రవరి 2 నాటికి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సుమారు ఏడాదిన్నర కాలంగా సర్పంచ్‌లు లేక గ్రామాల్లో పాలన బోసిపోయింది. సకాలంలో ఎన్నికలు చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయి.. గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చోటుచేసుకోలేదు. చాలావరకు గ్రామాల్లో అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర పనులు తప్పా మిగతా అభివృద్ధి పనులు, శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గాలు లేకపోవడంతో వారి స్థానంలో నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అడుగు పెట్టకపోవడంతో గ్రామాల్లో పరిపాలన మందగించింది. దీంతో పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడటంతో వారు సైతం ఏమీ చేయలేక చేతులేత్తేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది.

*_వీడని సందిగ్ధం.._*

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌ లోగా నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా పంచాయతీ ఎన్నికలా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపడుతారా.. అన్నదానిపై చర్చ మొదలైంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపై పార్లమెంట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా.. అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాత్రమే ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ద్వారా బీసీల జనాభా, ఓటర్ల డాటా కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం లభిస్తే అదనంగా బీసీ జనాభా డేటా బేస్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

*_సెప్టెంబర్‌ నెలలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు_*

ఆలోపే ముగించేందుకు ప్రభుత్వం కసరత్తు

*_ముందుగా పంచాయతీనా.. ప్రాదేశికమా అన్నదానిపై కొరవడిన స్పష్టత_*

*_రాజకీయ పార్టీలు, ఆశావహుల్లో మొదలైన సందడి_*

బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఉత్కంఠ

‘స్థానిక’ పోరుకు లైన్‌క్లియర్‌

‘స్థానిక’ పోరుకు లైన్‌క్లియర్‌

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share