
*భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు*
*97000 సీజ్ చేసిన అధికారులు*
భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన ప్రజావాణి జూన్ 26
భీమదేవరపల్లి మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై పలువురు ఈ మధ్యకాలంలో అనుమానాలు వ్యక్తం చేయడంతో కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా రిజిస్ట్రార్ ఆదేశానుసారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ, డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా చెల్లించాల్సిన రుసుము కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని సమాచారంతో తనిఖీ చేయగా డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర దాదాపు 97 వేల రూపాయలు పట్టుకున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయంలోపలికి రాకూడదని, కానీ ఎస్ ఆర్ ఓ అనుమతితోనే తాము లోపలికి వచ్చినట్లు వారు తెలిపారని అన్నారు. సంబంధిత సభ్యులు సీజ్ చేసినట్లు, అలాగే కార్యాలయాన్ని తనిఖీ చేయగా 2023 – 24 డాక్యుమెంట్లు సమర్పించలేదని తెలిపారు. ఏ డాక్యుమెంటల్ రైటర్స్ ద్వారా ఫైల్ వస్తుందో వాళ్ల పేర్లు వాటిపై ఉన్నాయని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని అన్నారు. సంబంధిత అధికారులపై అధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రజలు మీ పనులకై అధికారులు వేధిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ ఎస్ రాజు, ఎల్ రాజు సిబ్బంది పాల్గొన్నారు.